భావితరాలకు స్ఫూర్తి ఐలమ్మ పోరాటం | - | Sakshi
Sakshi News home page

భావితరాలకు స్ఫూర్తి ఐలమ్మ పోరాటం

Sep 11 2026 9:46 AM | Updated on Sep 11 2026 9:46 AM

గద్వాల: భూమి కోసం– భుక్తికోసం భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగించడమే ఆమెకు నిజమైన నివాళి అని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు. గురువారం వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌ వద్ద బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటంలో ఐలమ్మ ధైర్యసాహసాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. అప్పుడు పోరాటం చేసిన వారిలో ఐలమ్మ లాంటి చాలా కొద్ది మంది మహిళలు ఉన్నప్పటికీ ఆర్మీ లాంటి గెరిల్లా దళాలను ఏర్పాటు చేసి దోపిడి వ్యవస్ధకు వ్యతిరేకంగా పనిచేశారన్నారు. ఐలమ్మ జీవిత చరిత్ర భవిష్యత్‌ తరాలకు కూడా స్ఫూర్తిగా నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆమె జయంతి వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌, నర్సింగరావు, ట్రెయినీ కలెక్టర్‌ మనోజ్‌కుమార్‌ రెడ్డి, అక్బర్‌బాషా, రజక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

జ్ఞాన భారత్‌ మిషన్‌కు సహకరించాలి

గద్వాల న్యూటౌన్‌: జ్ఞాన భారత్‌ మిషన్‌లో భాగంగా జిల్లాలోని పురాతన ఆలయాల చరిత్ర, ఈ ప్రాంత సంస్కృతి, ప్రాచీన సాహిత్యాలను డిజిటలైజేషన్‌ చేసేందుకు వివిధ రంగాల వ్యక్తులు, పరిశోధకులు సహకరించాలని కలెక్టర్‌ ఒక ప్రకటనలో కోరారు. పర్యాటక జిల్లాలోని ప్రాచీన కట్టడాలకు సంబంధించిన సమాచారం, ప్రముఖ సాహితీవేత్తల రచనలు, శాసనాలు, తాళపత్ర గ్రంథాలు ఎవరి వద్దనైనా ఉంటే శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ ఎంఏఎల్‌డీ డిగ్రీ కళాశాలలో నిర్వహించే సమావేశంలో తెలియజేయాల్సిందిగా కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement