గణేష్‌ మండపాల వద్ద పటిష్ట నిఘా | - | Sakshi
Sakshi News home page

గణేష్‌ మండపాల వద్ద పటిష్ట నిఘా

Sep 11 2026 9:46 AM | Updated on Sep 11 2026 9:46 AM

గద్వాల క్రైం: గణేష్‌ మండపాల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేసి.. నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో శాంతిభద్రతల విషయాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు పికెటింగ్‌ నిర్వహించి అనుమానిత వ్యక్తులను గుర్తించాలన్నారు. గణేష్‌ ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, నిమజ్జన ఏర్పాట్లు, ఊరేగింపులో అల్ల ర్లు, ఘర్షణలకు తావులేకుండా ప్రార్థనా మందిరాల వద్ద పోలీసు బలగాలను నియమించాలన్నారు. పోలీసుల అనుమతి లేకుండా మండపాలు, భారీ శబ్ధంతో కూడిన సౌండ్‌ బాక్స్‌లు పెట్టిన వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలన్నారు. చెక్‌పోస్టుల వద్ద నిఘా ఉంచి ప్రతి గూడ్స్‌ వాహనాలు, కంటైనర్లను తనిఖీ చేయాలన్నారు. సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక విచార ణ చేపట్టాలని, అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్‌ బియ్యం, నిషేధిత మత్తు పదార్థాలు, పేకాట స్థావరాలను గుర్తించి కట్టడి చేయాలన్నారు. పోలీ సులపై బాధితులు ఫిర్యాదు చేస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం జిల్లా న్యాయశాఖలో విధులు నిర్వహిస్తున్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లతో సమావేశం ఏర్పాటు చేసి కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా వాదనలు వినిపించాలని, బాధితుల సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించేలా చూడాలని సూచించా రు. సమావేశంలో ఏఎస్పీ శంకర్‌, డీఎస్పీ మొగిల య్య, సీఐలు శ్రీను, ప్రదీప్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement