అలంపూర్ రూరల్: ఐదవ శక్తిపీఠం, నవబ్రహ్మాలయాల దివ్యధామ అలంపూర్ క్షేత్రాన్ని బుధవారం రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు సతీ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా కమిషనర్‌కు ఆలయ ఈఓ దీప్తి, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబదేవి ఆలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేసి, శేషవస్త్రాలతో సత్కరించారు. కాగా, అలంపూర్ క్షేత్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్ జయరాముడు, కౌన్సిల్ సభ్యులు కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ విక్రం, కౌన్సిలర్లు మోహన్‌రెడ్డి, జమ్మన్న, కోఆప్షన్ సభ్యులు కృష్ణమూర్తి, ముజీప్, నాయకులు వెంకట్రామయ్యశెట్టి, చిన్న య్య, సురేశ్, రజినిబాబు, సుందర్‌రాజ్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.
బీచుపల్లి సందర్శన..
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలో అభయాంజనేయస్వామిని దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ ఈఓ పురేందర్ కుమార్, సిబ్బంది పూర్ణకుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికి శేషవస్త్రాలతో సత్కరించారు.


