గద్వాల: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాసు హనుమంతు, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాల ను నిరసిస్తూ.. బుధవారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద బీఆర్‌ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను మోసపూరిత ప్రభుత్వం ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. పాలకులు వ్యక్తిగత ఆదాయంపై దృష్టిసారించి.. సామా న్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు 420 హామీలుగా మిగిలిపోయ్యాయని ధ్వజమెత్తారు. మాట తప్పడం.. ప్రజలను మోసం చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. నాగర్‌దొడ్డి వెంకట్రాములు, రాఘవేంద్రరెడ్డి, కోటేశ్, శ్యామల, పద్మ, వెంకటేశ్, రాము, సునీత, జగదీశ్, బస్వారాజ్ పాల్గొన్నారు.


