గట్టు/మల్దకల్: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం గట్టు మండలం బల్గెర, గంగిమాన్‌దొడ్డి, మల్దకల్ మండలం మేకలసోంపల్లి, సద్దలోనిపల్లి, మల్లెందొడ్డి, బూరెడ్డిపల్లి గ్రామాల్లో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించి.. నూతన దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి.. వారి సొంతింటి కలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇల్లు మంజూరు కాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గద్వాల నియోజకవర్గంలో మొదటి విడత 3,500 ఇళ్లు మంజూరు కాగా.. వాటిలో 2,000 నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. త్వరలోనే పనులు పూర్తిచేసుకొని గృహప్రవేశాలు చేయాలని లబ్ధిదారులకు సూచించారు. కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ రాజారెడ్డి, సర్పంచులు విజయ్, తూం కృష్ణారెడ్డి, నాయకులు రామకృష్ణారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, రామకృష్ణనాయుడు, హనుమంతురెడ్డి, బజారి, రమేశ్‌నాయుడు, గోవిందు, పుల్లారెడ్డి వెంకటన్న, ప్రభాకర్‌రెడ్డి, సత్యారెడ్డి, కృష్ణారెడ్డి, రమేశ్‌రెడ్డి, వీరన్న, వెంకటన్న, శివారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.


