ఎర్రవల్లి: శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం లక్ష్మీహయగ్రీవుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పవిత్రోత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయంలో వేద దివ్యప్రబంధ పారాయణం, యాగశాలలో చుతుస్థానార్చన, మూలమంత్ర మూర్తిహోమం, శాంతిహోమం, మహా పూర్ణాహుతి, పవిత్ర విజర్జన, కుంభ ప్రోక్షణ, మహ నివేదన, వేదదివ్య ప్రబంధ శాత్తుముఱై, ఆచార్య సన్మానం, వేదమహాదాశీర్వచనం వంటి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలంలో 873.4 అడుగుల నీటిమట్టం
అచ్చంపేట: శ్రీశైలం జలాశయంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి 873.40 అడుగుల వద్ద 156.0124 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువనున్న ఆల్మటి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నీటి ప్రవాహం లేదు. దీంతో గురువారం 159.3828 టీఎంసీలు ఉన్న నీటిమట్టం విద్యుదుత్పత్తి, సాగు, తాగునీటికి వినియోగించుకోవడంతో సుమా రు 3 టీఎంసీల నీటిమట్టం తగ్గినట్లయింది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు 35,315 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి హంద్రీ– నీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా 3,050, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ ప్రభుత్వం తరలిస్తోంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణ 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తోంది.
అమరవీరుల స్ఫూర్తితో పోరాడుదాం
గద్వాల: బషీర్ బాగ్ విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఐక్యంగా పోరాటాలు చేస్తేనే హక్కులు సాధించగలుగుతామని, అప్పుడే ప్రభుత్వాలు దిగివస్తాయని పేర్కొన్నారు. శుక్రవారం విద్యు త్ అమరవీరుల స్మారక దినం సందర్భంగా పార్టీ జిల్లా కార్యలయం వద్ద 2000 సంవత్స రంలో బషీర్‌బాగ్ విద్యుత్ ఉద్యమంలో అమరులైన బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డి, రామకృష్ణను స్మరించుకుంటూ వారి చిత్రపటానికి పూ లమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, నరసింహ, వెంకట్, రాముడు తదితరులు పాల్గొన్నారు.


