ధరూరు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రధాని చేయడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నట్లు సామాజిక కార్యకర్త, న్యాయవాది కాటూరి వెంకటేశ్వర్లు అన్నారు. జూన్ 19న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన పాదయాత్ర 1,400 కి.మీ., పూర్తి చేసుకుని శుక్రవారం ధరూరుకు చేసుకుంది. పాదయాత్ర ధరూరుకు చేరుకోగా సర్పంచు విజయ్‌కుమార్ వారికి శాలువా, పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్, అభ్యుదయానికి కృషి చేస్తూ పాదయాత్ర చేస్తున్నట్లు వివరించారు. కాశ్మీర్ వరకు కొనసాగే ఈ పాదయాత్ర ప్రస్తుతం తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల మీదుగా తెలంగాణలోకి అడుగు పెట్టిందన్నారు. దేశ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలనేదే తమ లక్ష్యం అన్నారు. తన ప్రయాణంలో అన్ని రాష్ట్రాల్లోనూ రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని బలమైన కోరిక వ్యక్తమైందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ నియోజకవర్గ కోఆర్డినేటర్ రవి, నాయకులు శ్రీహర్ష, సంజీవ్, లాజర్, ఈదన్న, సవారన్న, గోపాల్, రఫి తదితరులు పాల్గొన్నారు.


