గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి

Jul 30 2026 1:27 AM | Updated on Jul 30 2026 1:27 AM

గట్టు: గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని అడిషనల్‌ కలెక్టర్‌ నర్సింగ్‌రావు సూచించారు. బుధవారం గ ట్టు మండల పరిషత్‌ కార్యాలయంలో ప్రత్యేకాధి కారి అక్బర్‌పాషా అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రస్తు తం నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు ఊరికి ఊటకుంట, ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత, పొలాల్లో పంట కుంట ఏర్పాటుచేసుకొని భూగర్భజలాలను పెంపొందించేందుకు కృషి చేయాలని కోరారు. రైతులు ఆరుతడి పంటలను సాగుచేసే విధంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అంతకు ముందు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్పంచులు సభ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో ఎంపీడీఓ చెన్నయ్య ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement