మద్యం తాగి ఎవరూ వాహనాలు నడపవద్దు. తనిఖీలలో 20 నుంచి 45 ఏళ్లలోపు వారే ఎక్కువగా డ్రంకెన్ డ్రైవ్‌లో పటుబడుతున్నారు. యువత పార్టీల పేరుతో బైక్‌లపై బయటకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది ప్రమాదాల బారినపడి మృతిచెందిన ఘటనలు ఉన్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను ఓ కంట కనిపెట్టుకొని ఉండాలి. పదే పదే తనిఖీల్లో పటుబడితే జైలుశిక్షతోపాటు లైసైన్స్ రద్దుకు చర్యలు ఉంటాయి. ప్రతిఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించి సురక్షితమైన ప్రయాణం చేయాలి. యువత ఉన్నత లక్ష్యలపై దృషి సారించి భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
– మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల


