
227 దుకాణాలు.. 5,179 టెండర్లు
మహబూబ్‌నగర్ క్రైం: సాధారణంగా మద్యం వ్యాపారం చేయాలన్నా కోరిక చాలా మందిలో ఉంటుంది.. దీంతో వైన్స్ దుకాణాలకు టెండర్లు వేయడంలో విపరీతమైన పోటీ నెలకొంటుంది. వేసిన టెండర్లలో వారి అదృష్టం పరీక్షించుకొని దుకాణాలు దక్కించుకోవాలనుకుంటారు. కానీ, ఈసారి జరిగిన టెండర్ల ప్రక్రియలో ఉమ్మడి జిల్లాలో ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదని వచ్చిన లెక్కలు చెబుతున్నాయి. ప్రతి జిల్లాలో ఊహించని విధంగా టెండర్లు తగ్గడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మద్యం వ్యాపారుల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి 23 రోజుల వ్యవధి ఇచ్చినా కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనికితోడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన కొందరు దూరంగా ఉండటం ఒక కారణమైతే.. టెండర్ ఫీజు రూ.3 లక్షలకు పెంచడం కూడా ప్రభావం చూపింది.
అర్ధరాత్రి 12 గంటల వరకు..
ఉమ్మడి జిల్లాలోని 227 దుకాణాలకు గాను మొత్తం 5,179 టెండర్లు దాఖలు అయ్యాయి. ఇందులో శనివారం ఒక్కరోజే 2,428 దరఖాస్తులు రావడం విశేషం. చివరిరోజు కావడంతో దరఖాస్తులు తీసుకోవడానికి అర్ధరాత్రి 12 గంటల వరకు సమయం ఇవ్వడం వల్ల ఎకై ్సజ్ అధికారులు ఆయా జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్‌లలో అర్ధరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరించారు. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.155.37 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం వచ్చిన టెండర్లలో మహబూబ్‌నగర్ మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాలు ఉన్నాయి.
● జాతీయ రహదారిపై ఉన్న దుకాణాలతోపాటు ఆంధ్ర, రాయలసీమ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నవాటికి సైతం ఈసారి టెండర్లు భారీగా తగ్గాయి. గతంలో జాతీయ రహదారి వెంట ఉన్న దుకాణాలకు చాలా వరకు డిమాండ్ ఉండేది. ఒక్కో దుకాణానికి వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చేవి. కానీ, ఈసారి పరిస్థితి చాలా వరకు తారుమారైంది. దీంతో గతంలో బాగా డిమాండ్ ఉన్న దుకాణాలకు సైతం టెండర్లు తగ్గాయి.
జిల్లా చివరిరోజు 2025 2023
టెండర్లు టెండర్లు టెండర్లు
మహబూబ్‌నగర్ 671 1,554 2,540
నాగర్‌కర్నూల్ 750 1,423 2,524
నారాయణపేట 372 806 1,035
జోగుళాంబ గద్వాల 256 723 1,179
వనపర్తి 379 673 1,341
మొత్తం 2,428 5,179 8,619
మహబూబ్‌నగర్ 46.62
నాగర్‌కర్నూల్ 42.69
నారాయణపేట 24.18
జోగుళాంబ గద్వాల 21.69
వనపర్తి 20.19
మద్యం లైసెన్స్‌ల కోసం వ్యాపారుల్లో కనిపించని జోష్
ఉమ్మడి జిల్లాలో గతంలోకంటే భారీగా తగ్గిన టెండర్లు
అత్యధికంగా కోయిలకొండలో 50, కృష్ణాలో 42 దాఖలు
జాతీయ రహదారి, సరిహద్దు ప్రాంతాల్లోనూ అంతంతే..
చివరి రోజు 2,428 దరఖాస్తుల స్వీకరణ
టెండర్ల ద్వారా రూ.155.37 కోట్ల ఆదాయం

227 దుకాణాలు.. 5,179 టెండర్లు