
పంటలు పరిశీలించిన శాస్త్రవేత్తలు
అలంపూర్ రూరల్: అలంపూర్ మండలం క్యాతూర్ శివారులోని మొక్కజొన్న పంటను శనివారం పాలెం శాస్త్రవేత్తలు శశిభూషణ్, శంకర్, ఈశ్వర్‌రెడ్డి పరిశీలించారు. మొక్కజొన్న పంటలో ఎక్కువ కంకులు రావడం గురించి రైతులు ఫిర్యాదు చేయడంతో శాస్త్రవేత్తల బృందం ఇక్కడికి వచ్చినట్లు ఏఓ నాగార్జున్‌రెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలో పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. అక్కడి రైతులు అందించిన సమాచారాన్ని నమోదు చేసుకున్నారు. పూర్తి వివరాలతో నివేదిక అందజేస్తామని వారు తెలిపారు. అదేవిధంగా, మండలంలోని బుక్కాపూరంలోని ఉల్లి, వరి, శనగ, మినుము పంటలను పరిశీలించారు. వరిలో కాండం తొలిచే పురుగు, పొట్టకుల్లు తెగులు నివారణ చర్యల్లో భాగంగా కారటప్ హైడ్రోక్లోరైడ్ 500 గ్రాములు ప్రొపికనోజోల్ 250 మి.లీ. ఎకరాకు పిచికారీ చేయాలని రైతులకు సూచించారు.