
ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో అడ్మిషన్లు
గద్వాల: ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్‌లో 2025–26వి ద్యాసంవత్సరంలో చదివేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ప్రకటనలో తెలిపారు. ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ విధానం ద్వారా విద్యను అభ్యసించేందుకు తెలంగాణ ఓపెన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ గొప్ప అవకాశం అని తెలిపారు. జిల్లాలో 2025–26 విద్యాసంవత్సరానికి గాను 1780మంది అభ్యర్థులు చదువుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఇప్పటి వరకు 1065 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన సీట్లకు సంబంధించి ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 23వ తేదీలోపు దరఖాస్తులను చేసుకోవాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 17సెంటర్లు ఉన్నాయని ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని, www .telanganoapenrchoo.orf వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
రూ.2.23 కోట్ల ధాన్యం స్వాహా
గద్వాల: గద్వాల పట్టణ సమీపంలోని డ్యాంరోడ్డులో ఉన్న శ్రీరామ రైస్‌మిల్లులో రూ.2.23 కోట్ల ధాన్యం స్వాహా అయినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఈ రైస్‌మిల్లుకు ప్రభుత్వం 2022–23లో 1423 మెట్రిక్‌టన్నుల ధాన్యం కేటాయించింది. ఇందులో 912 మెట్రిక్ టన్నులు స్వాహా చేసినట్లు, అదేవిధంగా 2024–25 ఖరీఫ్ సీజన్‌లో 1570 మెట్రిక్‌టన్నుల కేటాయించగా ఇందులో 12మెట్రిక్ టన్నులు, రబీ సీజన్‌లో 1074 మెట్రిక్ టన్నుల ధాన్యానికి 125మెట్రిక్ టన్నుల ధాన్యం స్వాహా అయినట్లు విజిలెన్స్‌అండ్‌ఎన్‌పోర్స్‌మెంట్ అధికారులు చేపట్టిన తనిఖీలో వెలుగు చూసినట్లు ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో సీఐ, తహసీల్దార్, డీసీటీవోలతో కూడిన బృందం సభ్యులు, సివిల్‌సప్‌లైశాఖ డీఎస్‌ఓ స్వామికుమార్, డీఎం విమల పాల్గొన్నట్లు తెలిపారు.
ఆదిశిలా క్షేత్రంలోప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఈసందర్భంగా అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే, భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు అరవిందరావు, చంద్రశేఖర్‌రావు, వాల్మీకి పూ జారులు తిమ్మప్ప, నర్సింహులు, ఆలయ సి బ్బంది రంగనాథ్, ఉరుకుందు, కృష్ణ, శివమ్మ, రాము, శ్రీను, చక్రి తదితరులు పాల్గొన్నారు.
శనేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు
బిజినేపల్లి: నందివడ్డెమాన్ శనేశ్వరాలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. తమ ఏలినాటి శని నివారణ కోసం జైష్ఠ్యాదేవి సమేత శనేశ్వరుడికి తిల తైలాభిషేకాలు, అర్చనలు చేశారు. ము ందుగా అర్చక బృందం శనేశ్వరుడిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమా లు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాజేశ్, ప్రభాకరాచారి, అర్చకులు శాంతికుమార్, ఉమామహేశ్వర్ పాల్గొన్నారు.

ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో అడ్మిషన్లు