
పెండింగ్ విద్యుత్ బిల్లులు చెల్లించాలి
అయిజ: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేస్తామని, పెండింగ్ లేకుండా ప్రతి నెలా బిల్లులు చెల్లించాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ రాజు, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ మదన్, ఏఈ నరేందర్‌రెడ్డితో కలిసి ఎస్‌ఈ పెండింగ్ బిల్లులు వసూలు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పెండింగ్ బిల్లులు ఎక్కువగా ఉన్నాయని, నిర్ణీత సమయంలో చెల్లించని వారి కనెక్షన్‌లు కట్ చేస్తామన్నారు. అదేవిధంగా విద్యుత్ సిబ్బందికి పెండింగ్ బిల్లుల వసూళ్లపై సలహాలు, సూచనలు చేశారు. అయిజ, మల్దకల్, గద్వాలలో పర్యటించినట్లు పేర్కొన్నారు.