
వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలి
మల్దకల్: రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు తప్పనిసరి పాటించాలని ఏడీఎ సంగీతలక్ష్మి అన్నారు. మంగళవారం మల్దకల్ రైతు వేదికలో వ్యవసాయ, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ వీసీ ద్వారా అధికారులు నేరుగా రైతులు, మండల వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. పంటల సాగు విధనంపై అవగహన కల్పించారు. పంటలకు అశించే చీడపిడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం ద్వారానే భూమి సారవంతంగా ఉంటుందని, తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు వచ్చే పంటలు సాగు చేసుకోవాలని పేర్కొన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు తప్పనిసరిగా రైతులు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఏఓ రాజశేఖర్, ఏఈఓలు ఖాజాపాష, భాస్కర్, కిశో ర్, రాహుల్‌పైలెట్, పల్లవి, సుజాత పాల్గొన్నారు.