
నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్
గద్వాల: జిల్లాలోని డిగ్రీ పూర్తి చేసిన బీసీ నిరుద్యోగ యువతకు గ్రూప్స్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీతోపాటు బ్యాంకింగ్ సర్వీసులకు టీజీ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు టీజీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే 5 నెలలు కోచింగ్ ఇవ్వబడుతుందని, అర్హత గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్ధులు ఆన్‌లైన్ వెబ్‌సైట్ www.tsbcstudycirc e.gov.in నందు ఈ నెల 16 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. శిక్షణ తరగతులు ఆగస్టు 25 నుంచి ప్రారంభమవుతాయని, కోచించ్ సమయంలో నెలకు రూ.వెయ్యి స్టైఫండ్ ఇవ్వబడునని తెలిపారు. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ.1.50 లక్షలలోపు పట్టణ ప్రాంతం వారికి రూ.2 లక్షల లోపు ఉండాలని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవత్వం
గద్వాల క్రైం: జిల్లా పోలీసు శాఖలో ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాజశేఖర్‌కు తోటి సిబ్బంది రూ. 80వేల ఆర్థిక సహాయని ఎస్పీ శ్రీనివాసరావు చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సహ ఉద్యోగి కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చేయూత ఇవ్వడం స్పూర్తిదాయకంగా ఉంటుందన్నారు. సమస్యలలో ఉన్నప్పుడు మనోఽధైర్యం ఇవ్వడంతో పాటు ఆర్థికంగా సహాయం అందజేయడంపై ఎస్పీ సిబ్బందిని అభినందించారు. ఆర్థిక సహాయం అందజేసిన వారిలో సహ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆవాజ్
రాష్ట్ర కమిటీ ఎన్నిక
గద్వాలటౌన్: ఆవాజ్ రాష్ట్ర మహాసభల సందర్భంగా రాష్ట్ర కమిటీని మంగళవారం ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్ష, కార్యదర్శులను, 39 మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఆవాజ్ రాష్ట్ర కమిటీ నూతన అధ్యక్షుడిగా ఎండీ జబ్బార్, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ అబ్బాస్, కోశాధికారిగా షేక్ అబ్దుల్ సత్తార్, సీనియర్ ఉపాధ్యక్షులుగా అతిఖుర్ రెహమాన్, ఉపాధ్యాక్షులుగా అజీజ్ అహ్మద్ ఖాన్, సయ్యద్ హాషం, అబ్దుల్ నబీ, సహయ కార్యదర్శులుగా ఎంఏ జజ్బార్, ఎంఏ ఇక్బాల్‌లతో పాటు 30 మందిని కమిటీ సభ్యులుగా నియమించారు.
అమరచింత చేనేత
సంఘానికి అవార్డు
అమరచింత: అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘాన్ని ఉత్తమ సంఘంగా ఎంపిక చేసి జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు చేతుల మీదుగా కంపెనీ సీఈఓ చంద్రశేఖర్‌కు అవార్డును అందించారు. నాబార్డు ఏర్పడి నేటికి 44 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో మంగళవారం నాబార్డ్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘం సీఈఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆరేళ్లుగా సంఘాన్ని కొనసాగిస్తూ చేనేత కార్మికులే కంపెనీ షేర్ హోల్డర్స్‌గా నియమించడంతో పాటు వచ్చిన లాభాల్లో అందరికీ సమాన వాటా ఇస్తున్నామని తెలిపారు. తమ కృషిని గుర్తించి నాబార్డు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సంఘంగా ఎంపిక చేసి అవార్డు ఇవ్వడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో నాబార్డ్ సీజీఎం ఉదయభాస్కర్, టీజీ క్యాబ్ చైర్మన్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్

నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్