
‘డీట్’ ను సద్వినియోగం చేసుకోవాలి
గట్టు: నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం రూపొందించిన డీట్ (డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ తెలంగాణ) యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీఓ శ్రీనివాసులు కోరారు. శుక్రవారం గట్టులోని ఐకేపీ దగ్గర డీట్ యాప్‌కు సంబందించిన పోస్టర్లను పీడీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీ శ్రీనివాసులు మాట్లాడుతూ డీట్ యాప్ ద్వారా నిరుద్యోగ యువకులు ఎక్కడికి వెళ్లకుండా ఉన్న చోటనే తమ అర్హతకు సరిపోయే ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవచ్చునని తెలిపారు. ఇందులో 944 కంపెనీలు భాగస్వాములు అయినట్లు తెలిపారు. ఆయా కంపెనీల్లో 8843 ఉద్యోగాలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో పుల్ టైం,పార్టు టైం,వర్క్ ప్రం హోం వంటి ఉద్యోగాలు ఇందులో ఉన్నట్లు తెలిపారు. నైపుణ్యవంతులైన నిరీక్షల నుంచి ఎంఫీల్, పీహెచ్‌డీ వరకు విద్యార్హత కలిగిన 15 ఏళ్లపైబడిన వారు, పని చేయడానికి ఆసక్తి ఉన్న వికలాంగులతో సహా అన్నీ సామాజిక వర్గాల అభ్యర్థులు ఇందులో ఉద్యోగాలు పొందే అ వకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడీ సీ అసిస్టెంట్ మేనేజర్ శ్యామల, ఎంపీడీఓ చెన్న య్య, డీఆర్‌డీఏ డీపీఎం రూతమ్మ, సలోమి, యల్లప్ప, ఇన్‌చార్జ్ ఏపీఎం జయాకర్, సీసీలు పాల్గొన్నారు.