
ఉపాధ్యాయుల శిక్షణతో విద్యార్థులకు మేలు
వనపర్తిటౌన్: జిల్లాలోని 15 పీఎంశ్రీ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు సైన్స్ ప్రాజెక్టులు నిర్వహించేందుకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కోర్స్ డైరెక్టర్ ఏఎంఓ మహానంది తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగిన శిక్షణకు ఆయన హాజరై మాట్లాడారు. ఒక్కో పాఠశాల నుంచి ఒక గణితం, ఇద్దరు భౌతికశాస్త్రం బోధించే ఉపాధ్యాయులు మొత్తం 45 మంది శిక్షణకు హాజరయ్యారని చెప్పారు. ఉపాధ్యాయుల శిక్షణతో విద్యార్థులకు మేలు చేకూరనుందని, అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించి వారితో ప్రాజెక్టులు చేయించడానికి శిక్షణ ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో కోర్స్ ఇన్‌చార్జ్, డీఎస్‌ఓ శ్రీనివాసులు, పీఎంశ్రీ స్కూల్స్ జిల్లా కో–ఆర్డినేటర్ ఎస్‌ఓ–1 శేఖర్, పీఎంశ్రీ డీఆర్పీ బలరాముడు, ఐఎఫ్‌పీ ప్యానెల్స్ జిల్లా ఇన్‌చార్జ్ శేఖర్, పాఠశాల ఇన్‌చార్జ్ సువర్ణాదేవి తదితరులు పాల్గొన్నారు.