
డబుల్‌బెడ్రూం ఇళ్లు కేటాయించాలి
గద్వాల: డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా గత రెండేళ్లుగా వాళ్ల సహనాన్ని పరీక్షించవద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలో లబ్ధిదారులతో కలిసి డబుల్‌బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణాలలో కొన్నింటికి విద్యుత్ కనెక్షన్లన్లు, వాటర్ సరఫరా, డ్రైనేజీలు, అంతర్గత రోడ్లు వంటి మౌళిక వసతులు కల్పించకుండా లబ్ధిదారులను మోసం చేస్తున్నట్లు ఆరోపణ చేశారు. ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించకుండా ఆలస్యం చేయడంతో కిటికీలు, తలుపులు, ధ్వసం అయ్యాయని దీనిపై జిల్లా అధికారులు వెంటనే స్పందించి లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలన్నారు. అదేవిధంగా ధ్వంసమైన ఇళ్లను పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలన్నారు. రెండేళ్ల కిందట లక్కీడిప్పు విధానంలో కలెక్టర్ వల్లూరి క్రాంతి లబ్ధిదారులను ఎంపిక చేశారని తరువాత 99మందిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించడం దారుణమన్నారు. ఉద్దేశపూర్వకంగానే పేర్లు తొలగిస్తూ, కాలయాపన చేయడం సరైన విధానం కాదని మండిపడ్డారు. లక్కీడిప్ విధానంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే డబుల్‌బెడ్రూం ఇళ్లు కేటాయించాలని లేదంటే లబ్ధిదారులతో కలిసి ప్రత్యేక్ష పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో నాయకులు ఉప్పేరు నర్సింహా, లబ్ధిదారులు లక్ష్మీ, శమిన్, పావని, రాజేష్, అంజి, రఘు, నాగరాజు, సురేష్, నరేష్, రాజు పాల్గొన్నారు.