ఆర్టీసీ ఎన్నికల్లో ముఖాముఖి పోటీ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఎన్నికల్లో ముఖాముఖి పోటీ

Oct 9 2026 1:20 AM | Updated on Oct 9 2026 1:20 AM

ఆర్టీసీ ఎన్నికల్లో ముఖాముఖి పోటీ

హన్మకొండ: ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో రెండు ఐక్య కూటమిల మధ్య ముఖాముఖి పోటీ నెలకొంది. నేడు (శుక్రవారం) ఉదయం 5నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అనంతరం ఓట్లు లెక్కిస్తారు. కానీ, ఫలితాలు అధికారికంగా వెల్లడించరు. అధికారికంగా ఎన్నికల ఫలితాల కోసం ఈనెల 17 వరకు వేచి చూడాలి. కాగా అనధికారికంగా ఫలితాలు కౌంటింగ్‌ ముగిసిన వెంటనే తెలిసే అవకాశముంది. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో 12 యూనియన్లు పోటీలో ఉన్నాయి. వరంగల్‌ రీజియన్‌లో మొత్తం 3,042 ఓట్లు ఉండగా 9 డిపోల్లో ఒక్కో బూత్‌, ఆర్‌ఎం కార్యాలయంలో మరోటి ఏర్పాటు చేశారు. నాలుగు యూనియన్‌లు బలంగా ఉండగా అశ్వత్థామ రెడ్డి నేతృత్వంలోని టీఎంయూ (వర్గం) తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌గా ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కలిసి ఒక కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఎంప్లాయీస్‌ యూనియన్‌, ఎన్‌ఎంయూ మరో ఐక్య కూటమిగా బరిలో నిలిచింది. ఎన్నికల్లో విజయం కోసం డిపోల వారీగా ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు, చివరగా రెండు ఐక్య కూటములు రీజియన్‌ స్థాయి బహిరంగ సభలు నిర్వహించి గెలిస్తే ఏం చేయబోతున్నామో చెప్పారు. కార్మికుల ముందు రెండు ఐక్య కూటములు మేనిఫెస్టోను ఉంచాయి. నమ్మి ఓట్లు వేయాలని కూటమిల నాయకత్వాలు అభ్యర్థించాయి.

వరంగల్‌ రీజియన్‌లో ఇలా..

వరంగల్‌ రీజియన్‌లో ప్రధానంగా రెండు ఐక్య కూటముల మధ్య పోటీ నెలకొనగా తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ కూటమి నుంచి క్లాస్‌–3 (రాష్ట్ర), క్లాస్‌–6 (రీజియన్‌)కు తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ బరిలో ఉంది. ఎంప్లాయీస్‌ యూనియన్‌, ఎన్‌ఎంయూ కూటమి నుంచి క్లాస్‌–3లో ఎంప్లాయీస్‌ యూనియన్‌ పోటీలో ఉండగా, క్లాస్‌–6లో ఎన్‌ఎంయూ పోటీ చేస్తుంది. ప్రతీ ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. క్లాస్‌–3, క్లాస్‌–6కు ఓటు వేయాలి. వరంగల్‌ రీజియన్‌లో జరుగనున్న ఎన్నికల్లో బ్యాలెట్‌లో 9 గుర్తులు మాత్రమే ఉంటాయి. ఐక్య కూటముల నేపథ్యంలో బ్యాలెట్‌లో గుర్తులు సంఖ్య తగ్గింది. దీంతో ఎన్నికల్లో 12 యూనియన్‌లు పోటీలో ఉన్న బ్యాలెట్‌లో మాత్రం 9 గుర్తులు మాత్రమే కనిపిస్తాయి.

పోలింగ్‌ సామగ్రి పంపిణీ..

పోలింగ్‌ నేపథ్యంలో గురువారం పోలింగ్‌ సామగ్రిని తీసుకుని సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. ఇప్పటికే అధికారులు పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు పకడ్బందీగా జరిగేలా కార్మిక శాఖ అన్ని చర్యలు తీసుకుంది.

కార్మికుల మద్దతు కోసం చివరి వరకు యత్నం

గెలుపే లక్ష్యంగా యూనియన్‌ నాయకులు ప్రతీ కార్మికుడిని స్వయంగా కలిసి తమకే ఓటు వేయాలని కోరారు. ప్రచారం ముగియడంతో పోటీలో ఉన్న యూనియన్‌ నాయకులు పోలింగ్‌పై దృష్టి సారించారు. కార్మికులు ఇంటికి వెళ్లి మద్దతు కోరారు. పోలింగ్‌ జరుగుతున్న సమయంలోను చివరి ప్రయత్వం చేయాలనే ఆలో చనలో నాయకులున్నారు. రెండూ కూటమలు తమదే గెలుపన్న విశ్వాసంతో ఉన్నాయి. మెజారిటీ కోసమే తమ తాపత్రయమని నాయకులు చెప్పారు. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌ నేతృత్వంలోని కూటమికి అధికా ర కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలోని ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎంప్లాయీస్‌ యూనియన్‌ నేతృత్వంలోని కూటమి తరఫున ఆ కూటమిలోని యూనియన్‌ల నాయకులు మాత్రమే ప్రచారం చేశారు.

టీడబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌

ఐక్య కూటమి, ఈయూ, ఎన్‌ఎంయూ కూటమి మధ్యపోరు

హోరాహోరీగా సాగిన ప్రచారం

పోలింగ్‌పై దృష్టి సారించిన యూనియన్లు

నేడే పోలింగ్‌.. అన్ని ఏర్పాట్లు పూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement