భూపాలపల్లి: ఎల్‌నినో ప్రభావంతో యాసంగి (రబీ) సీజన్‌లో నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగు పెద్దఎత్తున చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. యాసంగిలో పంటల సాగు కార్యాచరణ ప్రణాళికపై గురువారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వరి సాగుపై అధికంగా ఆధారపడకుండా జొన్న, మినుములు, పెసర్లు, కూరగాయలు, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకుని పంటల ప్రణాళిక రూపొందించా లని, భూములు బీడుగా ఉండకుండా ప్రత్యామ్నా య పంటల సాగువైపు రైతులను ప్రోత్సహించా లని తెలిపారు. ఈ సమావేశంలో డీఏఓ బాబూ రావు, ఉద్యాన శాఖ అధికారి తిరుపతి, వ్యవసాయ శాఖ ఏడీఏలు, మార్కెటింగ్ అధికారులు పాల్గొన్నారు.
జాబ్‌మేళా సద్వినియోగం
చేసుకోవాలి..
జిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో నేడు (శుక్రవారం) జిల్లాకేంద్రంలోని పుష్ప గ్రాండ్‌లో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. అభ్యర్థులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున, అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. జాబ్ మేళాలో అభ్యర్థుల సౌకర్యార్థం 15 రిజిస్ట్రేషన్ కౌంటర్లు, హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాబ్ మేళా విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది ఉదయం ఏడు గంటలకే పుష్ప గ్రాండ్‌కు చేరుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నిరుద్యోగ యువతీ యువకులు తమ విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా లభించే ఉద్యోగ అవకాశాలను సద్వి నియోగం చేసుకుని ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.
జాబ్‌మేళాకు ఏర్పాట్లు పూర్తి
కలెక్టర్ రాహుల్ శర్మ


