భూపాలపల్లి రూరల్: పౌష్టికాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ అన్నారు. 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమాల్లో భాగంగా భూపాలపల్లి మండలస్థాయి పోషణ మాసం కార్యక్రమాన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమాధికారి జి మల్లేశ్వరితో కలిసి మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లులు, పిల్లల్లో రక్తహీనత నివారణ, పిల్లలు తక్కువ బరువుతో పుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. సీడీపీఓ మల్లీశ్వరి పలు అంశాలపై అవగాహన కల్పించారు.


