న్యూస్‌రీల్
జంతువులు, పక్షులు, సరీసృపాలు, ఇతర జీవులది పర్యావరణ వ్యవస్థలో ముఖ్య పాత్ర. వాటి మనుగడ కాపాడడడం ప్రతీ ఒక్కరి బాధ్యత. అడవుల నరికివేత, వేట, అక్రమ రవాణా, అడవుల్లో మంటలు వంటి కారణాలతో అనేక వన్యజీవులు ప్రమాదంలో పడుతున్నాయి. వన్యప్రాణుల ఆవాసాలను రక్షించడం, అడవులను కాపాడడం, అక్రమ వేటను అరికట్టడంపై ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా వాటి మనుగడకు తోడ్పడవచ్చు. ముఖ్యంగా అడవులకు సమీపంలో నివసించే ప్రజలు వన్యప్రాణులతో సహజీవనం చేస్తూ, వాటికి హాని కలిగించకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ములుగు జిల్లా అడవుల్లో ఎలుగుబంటి, పిల్లి, అడవి పిల్లి, నాలుగు కొమ్ముల జింక, అడవి కుక్క, చుక్కుల జింక, భారతీయ నక్క, అడవి దున్న, తోడేలు కుక్క, హైనా, నల్లమెడ కుందేలు, నక్క, చిరుతపులి, లంగూర్ కోతి, రీసస్ కోతి, ముంగీస, నీలగాయి, ముళ్లపంది, అలుగు, సాంబర్ జింక, పెద్ద ఉడుత, ఎగిరే ఉడుత, పులి, అడవి పంది ఉన్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
సందర్శకులకు కనువిందు
హనుమకొండ హంటర్ రోడ్డులోని కాకతీయ జూవాలాజికల్ పార్క్ సందర్శకులకు కనువిందునిస్తోంది. ఇక్కడ జంతువులు, పక్షులు, తామర కొలను ఆకట్టుకుంటోంది. చిరుత పులి, అడవిదున్నలు, ఎలుగుబంటి, నక్కలు, అడవి పిల్లి, చుక్కల దుప్పి, సాంబర్ దుప్పి, కొండగొర్రెలు, మూషిక జింకలు, మనుబోతు, కృష్ణ జింకలు మొసళ్లు, తాబేళ్లు, నక్షత్ర తాబేళ్లు, గ్రీన్ ఇంగ్వానా(తొండ) నాలుగు రకాల సరీసృపాలు, నిప్పుకోడి, రియా, నెమళ్లు, నలుపు, తెలుపు హంసలు, రామచిలుక, లవ్ బర్డ్స్ వంటి 26 రకాల పక్షులున్నాయి. సందర్శకులకు కనువిందు చేయడానికి పెద్దపులులను తీసుకొచ్చినా వాటిలో ఒకటి చనిపోయింది. మరొకటి అనారోగ్యానికి గురవడంతో హైదరాబాద్ జూపార్క్‌కు తరలించారు. కొత్తగా హాగ్‌డీర్, బార్కింగ్‌డీర్, (దక్షిణ ఎరుపురంగు జింకలు) లుటినో పార్కిట్ (పసుపురంగు రామచిలుక)లు అందుబాటులో ఉన్నాయి.
జూపార్క్‌లోని నిప్పుకోడి (ఫైల్)
దట్టమైన అడవులు. వాటిని ఆసరాగా చేసుకుని బతికే ప్రాణులు. ఇవే ప్రక్రృతి సమతుల్యతకు ప్రధానం. మానవాళి మనుగడ కొనసాగించాలన్నా.. భవిష్యత్ తరాలు ఈ అందమైన ప్రపంచాన్ని చూడాలన్నా.. అడవులను, వణ్యప్రాణులను సంరక్షించాల్సిన అవసరం ఎంతో ఉంది. జంతుజాలానికి ఆలవాలమైన ఉమ్మడి వరంగల్ జిల్లా అడవులు వాటి సంరక్షణకు కేంద్రంగా నిలుస్తున్నాయి. నేడు (ఆదివారం) ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ.
– ఏటూరునాగారం/ న్యూశాయంపేట/ఖానాపురం
అటవీశాఖ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలోని అడవుల్లో సుమారు 169 కెమెరాలను అమర్చారు. వన్యప్రాణుల కదలికలను కెమెరాల్లో బందించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిత్యం గూడేల్లో అటవీశాఖ అధికారులు తనిఖీలు చేస్తూ వేటాడే వస్తువులు, ఆయుధాలు, సామగ్రిని స్వాధీనం చేసుకుంటున్నారు.
అటవీ శాఖ అధికారుల ప్రత్యేక దృష్టి..


