నాటుకు సిద్ధంగా ఉన్న నారు
నీళ్లులేక వెలవెలబోతున్న హుజుర్‌నగర్ ఊరకుంట
ఎల్‌నినో ప్రభావంతో లోటు వర్షపాతం ఏర్పడింది. దీంతో మహాముత్తారం మండలంలోని పలు గ్రామాల్లో రైతులు బోర్లకింద వరినాట్లు వేశారు. మరికొన్ని గ్రామాల్లోని చెరువుల్లోకి దేవాదుల నీరు రావడంతో నార్లు పోసి నాటు పనులు చేస్తున్నారు. కానీ, మున్ముందు వానలు కురవకపోతే సాగు చేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 20రోజుల క్రితం కురిసిన వానలకు పోసిన నార్లు ఎండిపోవడంతోపాటు ఎర్రబారుతున్నాయని అన్నదాతల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా వానలు పడతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు
– మహాముత్తారం


