ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం | - | Sakshi
Sakshi News home page

ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం

May 30 2026 2:50 AM | Updated on May 30 2026 2:50 AM

మల్హర్‌(కాటారం): కల్లాలో ఆరబోసిన ప్రతీ ధాన్యం గింజను రైతుల నుంచి కొనుగోలు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు అన్నారు. శుక్రవారం మండలంలోని కాటారం మార్కెట్‌ యార్డులో ఆరబోసిన ధాన్యాన్ని మంత్రి శ్రీధర్‌బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలతో ఇబ్బందులు జరుగుతాయని.. తడిసిన ధానాన్ని కొనుగోలు చేస్తామని అన్నారు. రైతులు ఎవరూ ఆందోళన పడొద్దని.. ధాన్యం మొత్తాన్ని సేకరిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌కు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పంతకాని తిరుమల, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

Advertisement
 
Advertisement
Advertisement