మూడో విడతకు మోక్షమెప్పుడో? | - | Sakshi
Sakshi News home page

మూడో విడతకు మోక్షమెప్పుడో?

May 30 2026 2:50 AM | Updated on May 30 2026 2:50 AM

రెండు విడతల్లో రైతులకు అందిన పెట్టుబడి సాయం వివరాలు

ములుగు: యాసంగి సీజన్‌ పంటలు చేతికి వచ్చినా పెట్టుబడి సాయం (రైతు భరోసా) పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందించలేకపోవడం పట్ల అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీజన్‌ ప్రారంభానికి ముందే అందాల్సిన పెట్టుబడి సాయం ఆలస్యమైనప్పటికీ రెండు విడతల్లో రెండు ఎకరాల వరకు మాత్రమే అందించడంతో మూడో విడతకు మోక్షమెప్పుడు లభిస్తుందని రైతులు ఎదురుచూస్తున్నారు. మొదటి విడత సాయం డబ్బులను మార్చి 23న, రెండో విడత సాయాన్ని ఏప్రిల్‌ 20న రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. నెల రోజులు దాటినా మూడో విడత సాయానికి సంబంధించిన షెడ్యూల్‌ ఇంకా ప్రభుత్వం ప్రకటించకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రెండు విడతల్లో అందిన సాయం ఇలా..

ములుగు జిల్లాలో 88,138 మంది రైతులకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.106,08 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేయాల్సి ఉండగా, రెండు విడతల్లో కలిపి 81,096 మంది రైతులకు రూ.66.56 కోట్లను జమ చేసింది. ఇంకా 7,042 మంది రైతులకు రూ.39.52 కోట్లను జమ చేయాల్సి ఉంది. ప్రతీ రైతుకు రెండెకరాల వరకు మాత్రమే పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించింది. ఐదెకరాల వరకైనా పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని రైతులు భావించినప్పటికీ రెండెకరాల వరకు మాత్రమే పరిమితం చేయడంతో అన్నదాతలు నిరుత్సాహానికి గురవుతున్నారు.

ఖరీఫ్‌ పంటలకు..

రైతు భరోసాపై అయోమయం

వానాకాలం పంటల సాగును జిల్లాలో రైతులు ఇప్పటికే ప్రారంభించారు. మరో 10 రోజుల్లో వర్షాలు కురిస్తే పంటలను సాగు చేసుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువులను సమకూర్చుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. యాసంగి పంటకే పెట్టుబడి సాయాన్ని రెండెకరాలకు పరిమితం చేయడంతో వానాకాలం పంట(ఖరీఫ్‌ సీజన్‌)కు అందే రైతు భరోసాపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కనీసం 5 ఎకరాల వరకు పెట్టుబడి సాయం అందిస్తామని కటాఫ్‌ ప్రకటించి ప్రతీ రైతుకు పెట్టుబడి సాయాన్ని సమాయానికి అందించాలని రైతులు కోరుతున్నారు.

యాసంగి సీజన్‌ ముగుస్తున్నా

అందని పెట్టుబడి సాయం

రెండు విడతల్లో ఇప్పటి వరకు

అందింది రెండు ఎకరాలకే..

మూడో విడత రైతు భరోసాపై

ఇప్పటికీ ఖరారు కాని షెడ్యూల్‌

మండలం రైతులు పెట్టుబడి

సాయం

(రూ.కోట్లలో)

ఏటూరునాగారం 6,785 5.43

గోవిందరావుపేట 6,346 5.49

కన్నాయిగూడెం 4,828 3.74

మంగపేట 10,121 9.57

ఎస్‌ఎస్‌తాడ్వాయి 7,557 6.85

వెంకటాపురం(కె) 8,014 6.39

వాజేడు 8,624 6.65

మల్లంపల్లి 5,676 4.41

ములుగు 11,952 9.09

వెంకటాపురం(ఎం) 11,193 8.94

Advertisement
 
Advertisement
Advertisement