ఇక రెండో విడత | - | Sakshi
Sakshi News home page

ఇక రెండో విడత

May 29 2026 2:19 AM | Updated on May 29 2026 2:19 AM

– 8లోu మొదటి విడత ప్రగతి ఇలా.. నత్తనడకన నిర్మాణాలు.. నిబంధనల కొర్రీలు..

న్యూస్‌రీల్‌

నేడు ఆదేశాలు వచ్చే అవకాశం..

జూన్‌ 2న ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం’ ప్రారంభం

శుక్రవారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2026

భూపాలపల్లి: సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలని ఆశపడుతున్న నిరుపేదలకు ప్రభుత్వం త్వరలోనే మరో తీపికబురు అందించనుంది. ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతను వచ్చేనెల 2వ తేదీన ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. తొలి విడతలో అవకాశం రాని అర్హులకు ఈసారి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.

గతంలో భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి, గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, మంథని నియోజకవర్గంలోని కాటారం, మల్హర్‌, మహాముత్తారం, మహదేవపూర్‌, పలిమెల మండలాల పరిధిలోని గ్రామాలకు మొత్తం 4,231 ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్ధిదారుల సొంత స్థలాల్లో పునాదుల దశ నుంచి స్లాబ్‌ పూర్తయ్యే వరకు మొత్తం నాలుగు విడతల్లో రూ.5లక్షల చొప్పున నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేసేలా నిబంధనలు విధించారు.

మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరై చాలాకాలం అవుతున్నా, జిల్లాలో ఇప్పటివరకు కేవలం 527 మాత్రమే పూర్తికావడం గమనార్హం. ఇందుకు ప్రధాన కారణం నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యమేనని లబ్ధిదారులు వాపోతున్నారు. చాలామందికి మొదటి, రెండో విడత బిల్లులు రాకపోవడంతో పునాదుల దశలోనే పనులు ఆగిపోయాయి. మరికొందరు కాంట్రాక్టర్లు, బిల్డర్లు, మేసీ్త్రలకు పనులు అప్పగించినా, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వల్ల వారు కూడా నిర్మాణాలను నిలిపివేశారు. దీనికి తోడు రోజురోజుకూ పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలు, లబ్ధిదారుల ఆర్థిక ఇబ్బందులు తోడవ్వడంతో ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయని తెలుస్తోంది.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ విస్తీర్ణానికి సర్కారు నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు లబ్ధిదారులకు ఇబ్బందికరంగా మారాయి. పరిమితిని మరింత పెంచి, ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రెండవ విడతలోనైనా నిబంధనలను సడలించాలని, బిల్లుల చెల్లింపులు సకాలంలో జరగాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు పోటెత్తిన

భూక్రయవిక్రయదారులు

కొనసాగుతున్న

మొదటి విడత నిర్మాణాలు

మంజూరైనవి 4,231

గ్రౌండింగ్‌ అయినవి 542

ప్రారంభించినవి 539

బేస్‌మెంట్‌ స్థాయి 985

స్లాబ్‌ స్థాయి 466

స్లాబ్‌ పూర్తయినవి 1,172

నిర్మాణం పూర్తయినవి 527

ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు సంబంధించి నేడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సూచనలు, నిబంధనల మేరకు రెండో విడతను సజావుగా నిర్వహిస్తాం.

– శ్రీకాంత్‌, డీఈ, హౌజింగ్‌

మే నెలాఖరులోగా కొనుగోళ్లు పూర్తి చేయాలి

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష

Advertisement
 
Advertisement
Advertisement