మత్తు పదార్థాలపై సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం జెడ్పీహెచ్‌ఎస్ గోరంట్ల పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ కాళేశ్వరం అంత్య పుష్కరాల్లో ఫ్లెక్సీ పట్టుకుని గురువారం అవగాహన కల్పించారు. శ్రీనో డ్రగ్స్–సేవ్ లైఫ్‌శ్రీ అనే నినాదంతో కరపత్రాలు పంచుతూ భక్తుల్లో చైతన్యం కల్పించారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు సేవించడంతో శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక సమస్యలు ఏర్పడుతాయని తెలిపారు. యువత మత్తుకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
– భూపాలపల్లి అర్బన్


