భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో గురువారం సాయంత్రం బలమైన ఈదురుగాలులు వీచాయి. సింగరేణి ఏరియా వర్క్‌షాపు, కేటీకే 5వ గని సమీపంతో పాటు పలుచోట్ల భారీ చెట్లు నేలకొరిగి రహదారులపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెట్లు విద్యుత్ తీగలపై పడటంతో జిల్లాకేంద్రంలోని పలు ప్రాంతాలతో పాటు సింగరేణి గనుల నివాస గృహాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ప్లెక్సీ తగిలి ఒక మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇండ్లపై కప్పు రేకులు ఎగిరిపడ్డాయి. విద్యుత్ శాఖ, సింగరేణి, మున్సిపల్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి చెట్ల తొలగింపు పనులు చేపట్టారు. విద్యుత్ లైన్లను మరమ్మతు చేసి సరఫరా పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.


