ఇంచెంచెర్వుపల్లిలో భారీ అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఇంచెంచెర్వుపల్లిలో భారీ అగ్నిప్రమాదం

May 29 2026 2:19 AM | Updated on May 29 2026 2:19 AM

పొలాల్లో చెలరేగుతున్న మంటలు

కాలిపోయిన వడ్ల కుప్పలు

వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని ఇంచెంచెర్వుపల్లి గ్రామంలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు వరికొయ్యలను తగలబెట్టగా గ్రామ పరిసరాల్లో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించాయి. వ్యవసాయ భూములను అగ్నికి ఆహుతి చేశాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఆగే తిరుపతి, రాజు, కామ సదానందం, అశోక్కు చెందిన ఐదెకరాల్లోని వరి పంట పూర్తిగా దగ్ధంకాగా, మూడు బోర్‌ మోటార్లు, పైపులు, వందల సంఖ్యలో వరిగడ్డి కట్టలు మంటల్లో కాలిపోయాయి..

పంట వ్యర్థాలను కాల్చితే చర్యలు

పంట పొలాల్లో వరి కొయ్యలు, వ్యర్థాలకు నిప్పు పెట్టి జరిగే ప్రమాదాలకు కారణమైన వారిపై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై చల్లా రాజు హెచ్చరించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఆయ న విలేకరులతో మాట్లాడారు. పంట వ్యర్ధాలను కా ల్చడం వల్ల భూసారం తగ్గడమే కాకుండా విద్యుత్‌ మోటార్లు, గడ్డివాములు తగలబడి రైతులకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతుందని తెలిపారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఐదెకరాల్లోని వరిపంట దగ్ధం

కాలిపోయిన మూడు బోరుమోటార్లు, పైపులు, వరిగడ్డి

Advertisement
 
Advertisement
Advertisement