చిట్యాల/భూపాలపల్లి రూరల్: రైతుల పండించిన ధాన్యంపై మిల్లు యాజమానులు అక్రమంగా కోతలు విధిస్తే చర్యలు తప్పవని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. చిట్యాల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో, భూపాలపల్లి మండలంలోని ఎస్.ఎం కొత్తపల్లి గ్రామంలో తడిసిన వరి ధాన్యాన్ని బుధవారం వారు పరిశీలించి, మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత లేకుండా చూడాలని, ఎలాంటి కోతలు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మకై ్క రైతులను ఇబ్బందులకు గురి చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి మిల్లలకు లారీలలో తరలించాలని తెలిపారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేస్తామన్నారు.వ జిల్లాలో ఇప్పటికే 90శాతం మక్కల కొనుగోలు పూర్తయిందని తెలిపారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ కాంటా అయిన ధాన్యాన్ని రైతులు తమ సొంత వాహనాల్లో మిల్లులకు తరలించుకోవచ్చని రవాణా చార్జీలు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు అవకతవకలు పాల్పడితే సస్పెండ్ చేస్తామని, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ ఆశోక్‌కుమార్, డీసీఓ వాల్యానాయక్, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీకృష్ణ , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, ఆర్‌ఐ రాజేందర్, మండల నాయకులు చిలుకల రాయకోంరు, అల్లకోండ కుమార్, గుర్రపు తిరుపతిగౌడ్, బుర్ర లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
కాంటావేసి త్వరగా మిల్లులకు
తరలించాలి
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన
ఎమ్మెల్యే గండ్ర, కలెక్టర్ రాహుల్‌శర్మ


