చిలుక జోస్యం... | - | Sakshi
Sakshi News home page

చిలుక జోస్యం...

May 28 2026 12:34 AM | Updated on May 28 2026 12:34 AM

చిలుక జోస్యం... అంతా వాకీటాకీతోనే.. నిండిన పార్కింగ్‌ స్థలం

పలిమెల(కాళేశ్వరం): కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి నది అంత్యపుస్కారల్లో బస్టాండ్‌ సమీపంలో పలువురు చిలుక జోష్యం చెబుతూ ఉపాధి పొందుతున్నారు. భక్తులు చిలుక జోష్యం చెప్పించుకుంటూ వారి జాతకాలు అడిగి తెలుసుకుంటున్నారు.

కాళేశ్వరం: అంత్య పుష్కరాల్లో దేవాదాయశాఖ అధికారులు, అర్చకులు, సిబ్బంది అంతా వాకీటాకీతో కమ్యూనికేషన్‌ చేస్తున్నారు. కాళేశ్వరం దేవస్థానంలో సెల్‌ టవర్‌ సిగ్నల్స్‌ సరిగ్గా పని చేయకపోవడంతో త్వరగా స్పందించడానికి ఎనిమిది వరకు వాకీటాకీలకు వినియోగిస్తున్నారు. కమిషనర్‌ స్థాయి నుంచి అర్చకుని వరకు వినియోగిస్తున్నారు.

కూలుతున్న టెంట్లు

పలిమెల (కాళేశ్వరం ): కాళేశ్వరంలో సరస్వతి నది అంత్యపుస్కారాల కోసం ప్రధాన ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన ఓ టెంటు గాలికి ఒక వైపు ఊడిపోయి ప్రమాదకరంగా మారింది. కాగా టెంటు నిర్వాహకులు నిత్యం పర్యవేక్షణ చేస్తూ ఎవరు ప్రమాదానికి గురికాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.

పెరిగిన గిరాకీ

మహాముత్తారం: సరస్వతి పుష్కరఘాట్‌వద్ద వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తులు బుధవారం ఎక్కువసంఖ్యలో రావడంతో గోదావరి నదివద్దసందండి నెలకొంది. గోదావరివద్ద ఏర్పాటు చేసిన వివిద దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. దీంతో దుకాణదారులకు గిరాకీ పెరగడంతో సంతోషం వ్యక్తంచేశారు.

మహాముత్తారం: సరస్వతీ అంత్యపుష్కరాల్లో భాగంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చిన వాహనాలు నిలుపుట కోసం అధికారులు పలు ప్రాంతాల్లో వాహనపార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశారు. వీఐపీ పార్కింగ్‌ స్థలంతోపాటు సరస్వతీ ఘాటువద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్‌ స్థలాలు నిండాయి. దీంతో పోలీసులు వచ్చి వెళ్లే వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ట్రాఫిక్‌ నియంత్రించారు.

Advertisement
 
Advertisement
Advertisement