కాళేశ్వరం: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరోంచా తాలూకా జానం పల్లె గ్రామానికి చెందిన గండ్రకోట సంపత్ 14 సంవత్సరాలుగా పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవల నిర్వహించిన ఎస్సై పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఎస్సైగా ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం మహదేవపూర్ మండలం రాపల్లి కోట గ్రామానికి తన అత్తమామలను కలవడానికి వచ్చిన సందర్భంగా రాపల్లి కోట యాదవ సంఘం బాధ్యులు సంపత్–స్రవంతి దంపతులకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. యాదవ సంఘం మండల అధ్యక్షుడు పంచక మల్లేష్ యాదవ్, ఉపాధ్యక్షుడు కాటమెన రాజయ్య, సర్పంచ్ కల్లా గట్టయ్య, సంఘం నాయకులు, బంధుమిత్రులు గ్రామస్తులు పాల్గొన్నారు.
భూపాలపల్లి అర్బన్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2000 సంవత్సరంలో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టులను స్మరించుకుంటూ ఈ నెల 31న 26వ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రజా ప్రతిఘటన రాష్ట్ర కార్యదర్శి సామ మోహన్‌రెడ్డి, రైతు కూలి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బొబ్బల సాంబయ్యలు తెలిపారు. జిల్లా కేంద్రంలో సీపీఐఎంఎల్, ప్రజా ప్రతిఘటన పార్టీ ఆధ్వర్యంలో కమాండర్లు సమ్మన్న, శనిగరపు రంజిత్‌ల వర్ధంతి సభకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఈ నెల 31న భూపాలపల్లిలో నిర్వహించనున్న వర్ధంతి సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కాండూరి కుమారస్వామి, ఐఎఫ్‌టీయూ నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కన్వీనర్ పావురాల భిక్షపతి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
వాజేడు: ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్మించిన వ్యాపార సముదాయాలకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీఓ శ్రీకాంత్ నాయుడు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు అద్దెకు ఇవ్వడంకోసం నాలుగు గదులను నిర్మించినట్లు తెలిపారు. 29లోగా టెండర్ షెడ్యూల్ తీసుకొని 30లోగా సాయంత్రం 5 గంటలలోగా టెండర్ సమర్పించాలని తెలిపారు. 31 తారీకున డ్రా తీసి గదులను కేటాయించనున్నట్లు వెల్లడించారు. టెండర్ ఫారం రూ.2000, దరఖాస్తు సొమ్ము రూ.5000 డీడీ తియ్యాలని తెలిపారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
వెంకటాపురం(కె): మండల కేంద్రంలో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు బుధవారం కాంగ్రెస్ నాయకులు అందజేశారు. పీఏసీఎస్ అధ్యక్షుడు చిడెం మోహనరావు, మండల అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, చిట్టెం సాయి, బాలసాని వేణు, తదితరులు ఉన్నారు.
చిట్యాల: మండలంలోని గిద్దెముత్తారం గ్రామంలో పని చేస్తున్న ఉపాధిహామీ కూలీలకు మాజీ సర్పంచ్ పోలవేన పోశాలు, మాజీ ఎంపీటీసీ పప్పుల విజయలక్ష్మీ సంజీవయ్య బుధవారం మజ్జిక ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో కూలీలు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


