ఎండలపై అప్రమత్తం.. | - | Sakshi
Sakshi News home page

ఎండలపై అప్రమత్తం..

May 28 2026 12:34 AM | Updated on May 28 2026 12:34 AM

ఎండలపై అప్రమత్తం..

కూలీలకు మజ్జిగ పంపిణీ చేస్తున్న దాతలు

ఉపాధి కూలీలకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న ఆశవర్కర్‌

వాజేడు: వేసవిలో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. ఎండల తీవ్రతరం కావడంతో ప్రజలు వడదెబ్బ బారిన పడుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉపాధి పనులను చేస్తున్న కూలీలకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందిస్తున్నారు. ఆశ కార్యకర్తలు కూలీలు పని చేస్తున్న చోటుకు వెళ్లి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. అదే విధంగా ఇంటింటికీ తిరిగితూ ఎండకు తీసుకోవాల్సిన రక్షణ చర్యలను తెలియజేస్తూ ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందిస్తున్నారు. ఎండలతో ఎలాంటి ఇబ్బందులు వచ్చిన వైద్యశాలకు వచ్చి వైద్యం చేయించుకోవాలని సూచిస్తున్నారు.

మజ్జిగ సరఫరా చేస్తున్న దాతలు

ఉపాధిహామీ పథకం పనులను చేస్తున్న కూలీలకు సర్పంచ్‌లు, దాతలు మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూలీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్పంచ్‌లు మజ్జిగ ప్యాకెట్లను వారికి అందిస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమయితేనే ఎండ సమయంలో బయటకు వెళ్లాలని తెలుపుతున్నారు.

ఉపాధి కూలీలకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న ఆశవర్కర్లు

మజ్జిగ సరఫరా చేస్తున్న దాతలు

Advertisement
 
Advertisement
Advertisement