వాజేడు: మండల పరిధిలోని చెరుకూరు నుంచి, ధర్మవరం వరకు అటవీ అనుమతులు లేవనే కారణంతో రహదారి పనులను నిలిపి వేశారని వెంటనే పనులు ప్రారంభించాలని బీఆర్‌ఎస్ మండల కార్యదర్శి పెనుమల్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మండల పరిధిలోని చెరుకూరు వద్ద జాతీయ రహదారిపై బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ధర్నా చేశారు. రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ జాతీయ రహదారిపై బీఆర్‌ఎస్ నాయకులు బైటాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రహదారి సింగిల్ రోడ్డు కావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. వాహనాలు వెళ్లలేని విధంగా రోడ్డు గుంతలమయంగా మారిందని ఆరోపించారు. రహదారి నిర్మాణం కోసం నిధులు మంజూరైనా పనులు పూర్తి చేయలేదని వెంటనే అటవీ అనుమతులు వచ్చేలా చేసి రోడ్డు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రహదారిపై బీఆర్‌ఎస్ నాయకులు ధర్నా చేస్తున్న విషయం తెలుసున్న పోలీసులు అక్కడికి చేరుకొని ధర్నాను భగ్నం చేశారు. రోడ్డుపై బైటాయించిన వారిని అక్కడిని నుంచి పక్కకు లాక్కెల్లారు. బీఆర్‌ఎస్ నాయకులు రామకృష్ణారెడ్డి, సాంబమూర్తి, బుల్లేశ్వరరావు, స్వరూప, జానకి రమణ, ఆదినారాయణ, సుమాంజలి, బెనిని, సాంబశివరావు, తిరిపతి రావు, లోహ మూర్తి తదితరులు ఉన్నారు.


