ధాన్యం కొనుగోలుపై ఆరోపణలు అవాస్తవం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోలుపై ఆరోపణలు అవాస్తవం

May 28 2026 12:34 AM | Updated on May 28 2026 12:34 AM

ధాన్యం కొనుగోలుపై ఆరోపణలు అవాస్తవం

ఏటూరునాగారం: జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరావు ఆరోపణలు అవాస్తవం అని కాంగ్రెస్‌ బ్లాక్‌ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న అన్నారు. ఏటూరునాగారం మండలం రోహిర్‌ గ్రామపంచాయతీ పరిధిలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్‌, సర్పంచ్‌లు కావిరి అర్జున్‌, దేవులపల్లి విజయ్‌ కుమార్‌ తదితరులు సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను కొనసాగిస్తోందన్నారు. ప్రస్తుతం కేంద్రాల్లో ధాన్యం నిల్వలు అధికంగా ఉండటంతో, కొంత ప్రాంతాల్లో లారీల కొరత కారణంగా రవాణాలో స్వల్ప ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ అధికార యంత్రాంగం వెంటనే స్పందిస్తూ ధాన్యం తరలింపునకు చర్యలు చేపడుతోందన్నారు. ఈ చిన్న సమస్యలను ప్రతిపక్ష నాయకులు రాజకీయ లబ్ధి కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేయడం సరికాదన్నారు. శంకరాజుపల్లి సర్పంచ్‌ దేవులపల్లి విజయికుమార్‌, జిల్లా ఎస్సి సెల్‌ కార్యదర్శి కొడగొర్ల పోచయ్య, యూత్‌ జిల్లా ఉప అధ్యక్షుడు సర్వ అక్షిత్‌, మండల వర్కింగ్‌ ప్రసిడెంట్‌ దొంగిరి మధుబాబు, గజ్జల అంకుల్‌, నర్సయ్య, శేఖర్‌, ఇనుగుల హరీష్‌, దుర్గయ్య, గోపాల్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వెంకన్న

Advertisement
 
Advertisement
Advertisement