వెంకటాపురం(కె): మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలని ఎంపీడీఓ జుమ్మిలాల్ అన్నారు. బుధవారం మండల మహిళా సమాఖ్య ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మహిళా సమాఖ్య సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా శక్తి వారోత్సవాలు ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధిలో ముందుండాలని అన్నారు. రుణం పొందిన మహిళలు సక్రమంగా చెల్లిస్తే రూ.10లక్షల వరకు రుణాలు పొందవచ్చని తెలిపారు. రుణం పొందిన మహిళలు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10లక్షల భీమా సౌకర్యం ఉంటుందని అన్నారు. మహిళా శక్తి సంఘాలకు పెరటి కోళ్ల పెంపకం, గొర్రె పెంపకం రుణాలు అందిసాతమని తెలిపారు. మండలంలో గ్రామాఖ్య భవనాలు 31 మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు పూనెం ఉషారాణి, ఏపీఓ భవాని, ఏపిఎం అప్పారావు, సీసీ శంకరమ్మ, సర్సయ్య, సమ్మయ్య, వెంకటలక్ష్మీ, సిబ్బంది స్వప్న, సతీష్, గ్రామ సమాఖ్య వీఓఏలు, ప్రజాతినిధులు పాల్గొన్నారు.
ఎంపీడీఓ జుమ్మిలాల్


