పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలి

May 28 2026 12:34 AM | Updated on May 28 2026 12:34 AM

పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలి

ములుగు రూరల్‌: ఉపాధిహామి పని ప్రదేశాలలో కూలీలకు సౌకర్యాలు కల్పించాలని బీఆర్‌ఎస్‌ నాయకుడు పోరిక గోవింద్‌నాయక్‌ అన్నారు. బుధవారం మండలంలోని జాకారంలో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలను సర్పంచ్‌ దాసరి సమత–రమేష్‌తో కలిసి మాట్లాడారు. ఉపాధి హామి పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వంవిఫలమయిందని అన్నారు. నీడ, మంచినీళ్లు, మెడికల్‌ కిట్‌లు అందుబాటులో లేవని అన్నారు. ఉపాధిహామి కూలీలలకు సకాలంలో డబ్బులను చెల్లించాలని అన్నారు. కూలీలకు పండ్లు పంపిణీ చేశారు.

బీఆర్‌ఎస్‌ నాయకుడు గోవింద్‌నాయక్‌

Advertisement
 
Advertisement
Advertisement