పొక్లెయినర్‌ను అడ్డుకున్న ఉపాధి కూలీలు | - | Sakshi
Sakshi News home page

పొక్లెయినర్‌ను అడ్డుకున్న ఉపాధి కూలీలు

May 27 2026 6:02 AM | Updated on May 27 2026 6:02 AM

భూపాలపల్లి రూరల్‌: మండలంలోని వజినపల్లి గ్రామంలో అక్రమంగా మట్టిని తరలించేందుకు వచ్చిన పొక్లెయినర్‌ను ఉపాధి హామీ కూలీలు అడ్డుకున్నారు. గ్రామంలోని స్థానిక చెరువులో కొంతకాలంగా జేసీబీతో గుంతలు తవ్వుతూ మట్టిని తరలిస్తున్నారు. ఉపాధి కూలీలు ఏకమై మంగళవారం జేసీబీ పనులను నిలిపివేశారు. ఈ సందర్భంగా జేసీబీ యజమాని కూలీలతో దురుసుగా ప్రవర్తించాడు. ఈ విషయమై కూలీ లు అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చి మట్టి తీయడానికి అనుమతులు లేవని తెలపడంతో జేసీబీ వెనుదిరిగిపోయినట్లు కూలీలు తెలిపారు.

వరికొయ్యలను కాల్చొద్దు

భూపాలపల్లి రూరల్‌: జిల్లాలోని రైతులు ఎవరు కూడా వరి కొయ్యలతో పాటు వివిధ పంటల వ్యర్ధాలను కాల్చవద్దని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొయ్యలను కాల్చడం వల్ల భారీ పరిమాణంలో విషపూరిత వాయువులైన కార్బన్‌ మోనాకై ్సడ్‌, కార్బన్‌ డయాకై ్సడ్‌ సల్ఫర్‌ ఆకై ్సడ్లు గాలిలో కలిసిపోయి దట్టమైన పొగమంచును ఏర్పరుస్తాయన్నారు. నేలను సారవంతంగా ఉంచే వానపాములు, మేలుచేసే బ్యాక్టీరియా మిత్ర పురుగులు, సూక్ష్మజీవులను, శిలీంధ్రాలను నాశనం చేస్తుందని వివరించారు.

పంట పొలాలను కాల్చొద్దు

కాళేశ్వరం: పంట అవశేషాలను, పొలాలను కాల్చడం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ మంగళవారం ఒక ప్రకటనలో రైతులకు విజ్ఞప్తి చేశారు. మహదేవపూర్‌ మండల పరిధిలోని కాళేశ్వరంలో జరిగిన పంట పొలాల అగ్ని ప్రమాద ఘటనలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ నరేష్‌ కుమార్‌, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, మహదేవపూర్‌ సీఐ వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఎస్సై తమాషారెడ్డి మంగళవారం ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసే చర్యలు చేపట్టారు. పోలీసులు వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించగా, ఫైర్‌ సిబ్బందితో కలిసి మంటలను పూర్తిగా ఆర్పివేశారు.

దేవాదుల ఎత్తిపోతల

వద్ద సిల్ట్‌ తొలగింపు

కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం గ్రామ పంచాయతీలోని గుట్టలగంగారం సమీపంలో గల గోదావరిపై ఉన్న దేవా దుల ఎత్తిపోతల వద్ద సిల్ట్‌ తొలగించే పనులు అధికారులు మంగళవారం మొదలుపెట్టారు. ప్రతీ సంవత్సరం మే నెల చివరి వారంలో ప్రారంభించి పోర్‌బే గదులతో పాటు, కాల్వలో ఉన్న సిల్ట్‌ను తొలగించి శుభ్రం చేస్తారు. దీంతో నీరు కాల్వ ద్వారా పోర్‌బే నుంచి నీరు మోటర్ల వద్దకు చేరుతుంది. ఇలా చేరడంతో పంపింగ్‌ చేయడానికి సులువుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

పిడుగుపాటుకు రైతు మృతి

రేగొండ: పిడుగుపాటుకు రైతు మృతిచెందిన ఘటన రేగొండ మండలం లింగాల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తిప్పారపు రాజు (34) పొలంలో ఉన్న పశువులను తీసుకురావడానికి వెళ్తుండగా సా యంత్రం ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఈ క్రమంలో పొలంలో ఉన్న రాజు పై పిడుగు పడి చనిపోయాడు. రాజుకు భార్య పావని, కూతురు, కుమారుడు ఉన్నారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, తోటి రైతులు కోరుతున్నారు.

తాటిచెట్టుపై పిడుగు

మొగుళ్లపల్లి:వేములపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం తాటిచెట్టు పై పిడుగుపడింది. దీంతో చెట్టుపై మంటలు చెలరేగాయి. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రాణదాతలు పైలట్లు

ములుగు రూరల్‌: అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే ప్రాణదాతలు అంబులెన్స్‌ పైలట్లని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. మంగళవారం అంతర్జాతీయ పైలెట్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఆయన కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement