ధాన్యం కొనేవరకూ పోరాటం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనేవరకూ పోరాటం

May 27 2026 6:02 AM | Updated on May 27 2026 6:02 AM

ఆత్మకూరు: చివరి ధాన్యం కొనుగోలు చేసే వరకు బీజేపీ పోరాటం ఆగదని బీజేపీ ప్రజాప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రభుత్వం మెడలు వంచి రైతు సమస్యలు పరిష్కరిస్తామని, కుల్కచర్ల నుంచి నీరుకుళ్ల వరకు అన్నీ సమస్యలే ఉన్నాయని వారు పేర్కొన్నారు. రైతు గోస–బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా మంగళవారం నీరుకుళ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ బృందం పరిశీలించింది. బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంపీలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌, ఆర్మూర్‌, కామారెడ్డి ఎమ్మెల్యేలు పైడి రాకేశ్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోశారన్నారు. మొక్కజొన్న కొనుగోళ్లు నిలిపివేశారని, ధాన్యం కొనుగోళ్లను కూడా ఎత్తేస్తారని రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. వరంగల్‌ డిక్లరేషన్‌లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 50 రోజులుగా వడ్ల కుప్పల మీదే నిద్రిస్తున్నారన్నారు. ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి బుకాయించుడు బంద్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులకు అప్పుల కుప్పలు, ఆత్మహత్యలు మిగిలాయని, కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుందని హెచ్చరించారు. బీజేపీ జాతీయ నాయకుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్‌, కిసాన్‌మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్మోహన్‌రెడ్డి, మాజీ ఎంపీ సీతారాంనాయక్‌, పరకాల ఇన్‌చార్జ్‌ కాళీప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి, రావు పద్మ, డాక్టర్‌ విజయ్‌చందర్‌రెడ్డి, దశమంతరెడ్డి పాల్గొన్నారు.

బీజేపీ శాసనసభాపక్షనేత మహేశ్వర్‌రెడ్డి, ఎంపీలు రఘునందన్‌రావు, ఈటల

Advertisement
 
Advertisement
Advertisement