కాళేశ్వరం: బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని ఏఎస్పీ నరేష్‌కుమార్ అన్నారు. బాల్య వివాహాల నిర్మూలనపై మంగళవారం కాళేశ్వరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేశ్‌కుమార్ మాట్లాడుతూ బాలికలకు విద్య, ఆరోగ్య, సురక్షితమైన భవిష్యత్‌ను కల్పించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. చట్ట ప్రకారం అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వివాహం జరగాలని తెలిపారు. బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించేలా రూపొందించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, మహదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఎస్‌ఐ తమాషా రెడ్డి, ఉప సర్పంచ్ సుధీర్, భరోసా ఎస్‌ఐ స్వప్న కుమారి, సీడీపీఓ, అంగన్‌న్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.
ఏఎస్పీ నరేష్‌కుమార్


