రోడ్డు నిర్మాణం పూర్తయ్యేనా? | - | Sakshi
Sakshi News home page

రోడ్డు నిర్మాణం పూర్తయ్యేనా?

May 27 2026 6:02 AM | Updated on May 27 2026 6:02 AM

టేకుమట్ల: శిథిలమైన వెల్లంపల్లి–ఎంపేడు ప్రధాన రోడ్డుతో ఎంపేడు, వెల్లంపల్లి రైతులు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతో గత సంవత్సరం రోడ్డు నిర్మాణం కోసం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రూ.3కోట్ల నిధులను కే టాయించారు. వెల్లంపల్లి, ఎంపేడు రైతులు ఇక నుంచి రవాణా కష్టాలు తప్పినట్టేనని ఆనందం వ్య క్తం చేశారు. శంకుస్థాపన చేసిన సుమారు ఆరు నెల ల అనంతరం కాంట్రాక్టర్‌ మొరంతో చదును చేసి కంకర పోశాడు. అనంతరం రోలర్‌తో చదును చేసి పత్తాలేకుండా పోయాడు. పనులు ప్రారంభమైన కొంత సమయానికి మళ్లీ నిలిచిపోవడంతో రానున్న వర్షాకాలంలో ఇబ్బందులు తప్పవని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కంకరతో కష్టాలు..

వెల్లంపల్లి–ఎంపేడు, కుందనపల్లి గ్రామాల రైతుల పొలాలు ఎక్కువగా ఈ రోడ్డు వెంటే వెళ్తుంటారు. ప్రస్తుతం రోడ్డు పొడవునా కాంట్రాక్టర్‌ కంకరపోసి వదిలేయడంతో కాడెడ్లు, రైతులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుండంతో ఇప్పట్లో బీటీ రోడ్డు నిర్మాణం లేనట్లేనా అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి బీటీ రోడ్డు నిర్మానానికి కృషి చేయాని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

నిలిచిన ఎంపేడు–వెల్లంపల్లి

రోడ్డు నిర్మాణం

కంకర పోసి వదిలేసిన కాంట్రాక్టర్‌

ఇబ్బంది పడుతున్న వాహనదారులు

Advertisement
 
Advertisement
Advertisement