మహాముత్తారం: సరస్వతీ అంత్యపుష్కర పుణ్యస్నానానికి వచ్చిన భక్తులు గోదావరిలో పూజలు నిర్వహించారు. కొంతమంది మహిళలకు గోదావరిలో స్నానమాచరించిన అనంతరం దేవుడి పూనకాలు వచ్చాయి. దీంతో స్నానానికి వచ్చన మరికొంతమంది మహిళలు తమ ఆరోగ్యంతోపాటు కుటుంబసమస్యలు సంతానంకోసం దేవతలను సంతు అడుగుతు దేవతలను ప్రసన్నం చేసుకున్నారు.
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ మోహన్ శర్మను వెంటనే పదవి నుంచి తొలగించి, మహిళా వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేయాలని కుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ డిమాండ్ చేశారు. మంగళవారం కాళేశ్వరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చిన మహిళా భక్తులను చైర్మన్ అవమానించారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే రెండు రోజుల్లో దేవస్థానం ఈఓ కార్యాలయం ముందు నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ అజ్మీరా పూల్ సింగ్ నాయక్, లింగమల్ల సదవాలిరావుతో పాటు తదితరులు పాల్గొన్నారు.
క్షమాపణ చెప్పాలి
మల్హర్(కాటారం): మహిళా లోకం అసహ్యించుకునే విధంగా కాలేశ్వరం ఆలయ చైర్మన్ మోహన్‌శర్మ ప్రవర్తన ఉందని ఆయన వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని కాటారం డివిజన్ బీఆర్‌ఎస్ నాయకుడు జక్కు శ్రావణ్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ స్పందించి, మహిళలపై దురుసుగా ప్రవర్తించిన చైర్మన్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు.
కుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ పీక కిరణ్


