బాలల హక్కులను పరిరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

బాలల హక్కులను పరిరక్షించాలి

May 27 2026 6:02 AM | Updated on May 27 2026 6:02 AM

భూపాలపల్లి రూరల్‌: బాలల హక్కుల పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలోని ఐడీఓసీలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్నేహ బాలల హక్కుల సదస్సు, మాక్‌ పార్లమెంట్‌ కార్యక్రమానికి కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నారుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్యంపై అవగాహన పెంపొందించేందుకు మాక్‌ పార్లమెంట్‌ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. డీఆర్‌డీఓ బాలకృష్ణ, డీడబ్ల్యూఓ మల్లీశ్వరి, మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

చిట్యాల: గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం మండలంలోని చింతకుంట రామయ్యపల్లి గ్రామంలో గ్రామ పంచాయితీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. పీఆర్‌ ఈఈ వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ వసంతరావు, ఎంపీడీఓ జయశ్రీ, సర్పంచ్‌ మటిక సుజాత రవీందర్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ, మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, పంచాయతీ కార్యదర్శి సునంద పాల్గొన్నారు.

మహిళల సంక్షేమమే లక్ష్యం

మొగుళ్లపల్లి: మహిళాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అ న్నారు. మండలంలోని రంగాపురం గ్రామంలో నూ తనంగా నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారుల భవిష్యత్‌కు బలమైన పునాది అంగన్‌వాడీ కేంద్రాలేనని తెలిపారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి మల్లీశ్వరి, తహసీల్దార్‌ సునీత, ఎంపీడీఓ సురేందర్‌ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

Advertisement
 
Advertisement
Advertisement