రేగొండ: వానకాలం సీజన్ కోసం భూములను సిద్ధం చేసే క్రమంలో పంట వ్యర్థాలను తగులబెట్టడం చట్టరీత్యా నేరమని మండల వ్యవసాయాధికారి వాసుదేవరెడ్డి హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో విలేకరుల సమావేశంంలో ఆయన మాట్లాడుతూ.. పంట అవశేషాలను తగలబెట్టడం వలన గాలి కాలుష్యం పెరిగి ప్రజారోగ్యం దెబ్బతింటుందన్నారు. వేసవి కాలంలో మంటలు వేగంగా వ్యాపించి ఆస్తి, ప్రాణ నష్టం ఉందని హెచ్చరించారు. పంట వ్యర్థాలను తగలబెడితే రూ.2500 నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధిస్తారని తెలిపారు.
మహాముత్తారం: రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా పొలంలోనే కలియదున్నాలని మండల వ్యవసాయ అధికారి అనుష అన్నారు. మంగళవారం మండలంలోని వజినేపల్లి గ్రామంలో రైతులు కాల్చిన వరిపొలాలను పరిశీలించారు. అనంతరం ఏఓ మాట్లాడుతూ.. పంట కొతల అనంతరం అవశేషాలైనటువంటి వరికొయ్యలు పత్తికట్టె, మిరపకట్టె వంటి వాటిని కాల్చవద్దని రైతులకు సూచించారు. వాటికి కాల్చడం ద్వారా భూమిలో ఉన్న సూక్ష్మజీవులు చనిపోయి భూసారం దెబ్బతింటుందన్నారు.


