● జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్
రేగొండ: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ అన్నారు. సోమవారం కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవీలత ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా పాలకవర్గం కృషి చేయాలని కోరారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రాజు, ప్రాఽథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ, జిల్లా సెక్టోరియల్ అధికారులు సీఎంఓ రమేష్, ఏఎంఓ విజయ్‌పాల్‌రెడ్డి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ సంధ్య, సీఆర్పీ సహదేవ్, తదితరులు పాల్గొన్నారు.


