కాళేశ్వరం: మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామశివారు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ గెస్ట్ హౌస్‌లో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో గెస్ట్ హౌస్‌లో ఉన్న ఎలక్ట్రిక్ వస్తువులు, ఫర్నిచర్‌తో పాటు పలువురి సిబ్బంది సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయని ఆ సంస్థ గెస్ట్‌హౌస్ ఇన్‌చార్జ్ తపాస్ కుమార్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రమాదంలో రూ.1.48కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పవన్‌కుమార్ తెలిపారు.
అగ్ని ప్రమాద స్థలం పరిశీలన
మహదేవపూర్ మండలం అంబటిపల్లిలోని మేడిగడ్డ బరాజ్ వద్ద ఎల్‌అండ్‌టీ గెస్ట్ హౌస్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటన స్థలాన్ని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సోమవారం పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నామని తెలిపారు. భవిష్యత్‌లో ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.


