అర్ధాకలిలో పోలీసులు ? | - | Sakshi
Sakshi News home page

అర్ధాకలిలో పోలీసులు ?

May 26 2026 3:08 AM | Updated on May 26 2026 3:08 AM

చిట్యాల(కాళేశ్వరం) : ఈ నెల 21 నుంచి పుష్కరాలలో విధులకు హాజరైన పోలీసులు అర్ధాకలితో తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు తెలిసింది. ఐదు రోజులుగా బందోబస్తులో భాగంగా పగలు రాత్రి తేడా లేకుండా గస్తీ కాస్తు ప్రజల సంరక్షణే ధ్యేయంగా పని చే స్తున్న పోలీసులకు అకలి మంటలు తప్పడం లేదు. విధుల్లో పోలీస్‌ సిబ్బందికి క్యాంటీన్‌ ఏర్పాటు చేసి ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని అందిస్తున్నారు. ఉడికి ఉడకని టిఫిన్‌, భోజనాలు, నీళ్ల చారు, రుచి లేని కూరలతో తినలేక పోలీసులు కడుపు మార్చుకుంటున్నట్లు సమాచారం. దీంతో విధి లేక నగదు చెల్లింపులతో ఇతర హోటళ్లును అశ్రయిస్తు ఆకలి తీర్చుకుంటున్నట్లు తెలిసింది. పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను కే టాయించిన ప్రజా సంక్షేమం కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసులపై ఉన్నతాధికారులు అలసత్వం వహిస్తున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. ఉన్నతాధికారులు స్పందించి విధుల్లో ఉన్న పోలీస్‌ సిబ్బందికి నాణ్యమైన భోజనాలతో పాటు చల్లని తాగునీరు అందించాలని కోరుతున్నారు.

సేవా సంస్థ మహిళలపై ఆగ్రహం

కాళేశ్వరం: పుష్కరాలలో ఐదో రోజు పలువురు సేవా సంస్థ మహిళలపై చైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారని సోమవారం నిరసన తెలిపారు. ఈ క్రమంలో సేవాసంస్థ మహిళలు మాట్లాడుతూ గర్భగుడి వద్ద సేవా కార్యక్రమాలు చేస్తున్న తమను చైర్మన్‌ మోహన్‌శర్మ అమర్యాదగా మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారని మహిళలు నిరసన తెలిపారు. దీంతో కాసేపు ఆలయంతో పాటు ఈఓ కార్యాలయం వద్ద గందరగోళం నెలకొంది. ఈ విషయమై ట్రస్టుబోర్డు చైర్మన్‌ మోహన్‌శర్మను సంప్రదించగా సేవకు వచ్చిన మహిళలు భక్తులకు ఆటంకం కల్పిస్తు గర్భగుడిలో అభిషేకాలు చేస్తుండగా బయటికి రావాలని చెప్పినా ఎంతకీ ఆ మహిళలు వినలేదని, సేవా కార్యక్రమాలు చేయాల్సిన మహిళలు గర్భగుడిలోనే ఉంటున్నారని తెలిపారు. సుమారు 200 మంది వరకు గర్భ గుడిలో ఒకరి తరువాత ఒకరు గంటల తరబడి అభిషేకాలు చేస్తూ, భక్తుల దర్శనాలకు ఆటంకం కల్పించారని తెలిపారు. ఎవరినీ అమర్యాదగా ప్రవర్తించలేదన్నారు. భక్తులకు ఆటంకం కలుగడంతో వారిని బయటికి రావాలని కోపంతో చెప్పానని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement