టేకుమట్ల(కాళేశ్వరం): పుష్కరాలలో విపత్తులు సంభవించినప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెె త్తకుండా ఉండేందుకు ముందస్తు చర్యలో భాగంగా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఆల యం వద్ద, ప్రధాన ఘాట్, సరస్వతీ ఘాట్ వద్ద ఫైరింజన్‌లను ఏర్పాటు చేశారు. కానీ జిల్లాలోని ప్రతీ మండలంలో రోజుకో అగ్ని ప్రమాదం సంభవిస్తుండడంతో ఆ యా మండలాల ప్ర జలు ఫైరింజన్‌కు కా ల్ చేస్తే కాళేశ్వరంలో ఉన్నామంటున్నారు. ఇప్పటి వరకు టేకుమట్ల, చి ట్యాల, రేగొండ, మొగుళ్లపల్లి, గణపురం, భూ పాలపల్లి మండలాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో రై తులు లక్షల్లో నష్టపోయారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను కల్పించక పోవడంతో ప్రమాదాల తీవ్రత ఎక్కువ ఉంది.


