భూపాలపల్లి అర్బన్ : కాళేశ్వరం ముక్తీశ్వరస్వామి దేవస్థానం లో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా భూపాలపల్లి సింగరేణి స్కౌట్స్ అండ్ గైడ్స్ సిబ్బంది భక్తులకు సేవలందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. భక్తులకు మార్గనిర్దేశం చేయడం, క్యూలైన్ల నిర్వహణ, ఘాట్ల వద్ద భద్రతా సూచనలు ఇవ్వడం వంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యులు నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తున్నారు. పుష్కరాల నిర్వహణలో వారి సేవాభావాన్ని భక్తులు, అధికారులు అభినందించారు.


