కాళేశ్వరం : మహదేవపూర్ మండలం మద్దులపల్లిలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను సర్పంచ్ ఎల్పుల సరిత ఆధ్వర్యంలో సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘ నంగా సన్మానించారు. సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో కృషి చేసి మంచి మార్కులు సాధించి గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
కూలీలకు మజ్జిగ పంపిణీ
రేగొండ : కొత్తపల్లిగోరి మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు సర్పంచ్ కాడవేన సరిత యుగంధర్ సోమవారం మజ్జిగ పంపిణీ చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కూలీలు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు మజ్జిగ పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు.
పరిహారం చెల్లించాలి
మహాముత్తారం : చిన్నకాళేశ్వరం కాల్వ ని ర్మాణం పనుల్లో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నూతన మార్కెట్ విలువను అ మలు చేసి రైతులకు పరిహారం అందించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం భూ ముల మార్కెట్ విలువను పెంచేందుకు తీసుకున్న నిర్ణయం ఈనెల 28న నూతన మార్కెట్ విలువ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో గతంలో సర్వే చేసిన భూములకు నూతన మార్కెట్ విలువను అమలుచేసి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మహిళా వారోత్సవాలు
మల్హర్(కాటారం): మండలంలోని కాటారం ఎర్రగుంటపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం మహిళా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సీడీపీఓ రాధిక మాట్లాడుతూ స్థాని కంగా అందుబాటులో ఉండే తక్కువ ఖర్చుతో కూడిన పోషకాహార పదార్థాలను ఎలా విని యోగించుకోవాలో మహిళలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆహార వైవిధ్యం, ఆ రోగ్యకరమైన ఆహార అలవాట్లపై అవగాహన కల్పించి, ప్రతిజ్ఞ చేయించారు. సూపర్‌వైజర్ శివరాణి, పాల్గొన్నారు.
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా
భూపాలపల్లి అర్బన్ : భూపాలపల్లి ఆర్టీసీ డి పో ఎదుట సోమవారం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. తాము బతికుండగా నే రావాల్సిన బకాయిలు, పెన్షన్ అందించా లని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ కార్మికులు సమ్మిరెడ్డి, సదయ్య మాట్లాడుతూ పీఆర్‌సీ–2017 బకా యిలు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ మొత్తాలను వెంటనే చెల్లించాలని కోరారు. తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని డీఎంకు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో పలువురు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి
భూపాలపల్లి రూరల్: మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మదర్ థెరిసా పట్టణ సమైక్య ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా కొమురయ్య హాజరై మాట్లాడుతూ స్వయం సహాయక సంఘం సభ్యులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, మున్సిపల్ వైస్‌చైర్మన్ అంబాల శ్రీనివాస్, మెప్మా డీఎంసీ రాజేశ్వరి, సీఓ నిర్మల ఆర్పీలు, తదితరులు పాల్గొన్నారు.


